బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (19:19 IST)

భార్యతో బోర్ కొట్టింది.. వేరొక మహిళతో పెళ్లి కోసం ట్రిపుల్ తలాక్.. చివరికి?

ట్రిపుల్ తలాక్ ఇచ్చి ఓ అస్సాం లెక్చరర్ అడ్డంగా బుక్కయ్యాడు. ట్రిపుల్ తలాక్‌పై కఠినమైన చట్టాన్ని తెచ్చినప్పటికీ.. ఓ అస్సాం లెక్చరర్ భార్యను హింసించి.. వెంట వెంటనే మూడుసార్లు తలాక్ చెప్పి చేతులెత్తేశాడు.
 
వివరాల్లోకి వెళితే, సెంట్రల్ అస్సాంలో ఓ కళాశాలలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న మహమ్మద్ షరీపుద్దీన్. మహమ్మద్ షరీఫుద్దీన్ (48), పర్వీన్ అఖ్తర్ చౌదరి (43) దంపతులు. ఇటీవల ఆయనకు వేరొక మహిళను పెళ్లి చేసుకోవాలనిపించింది. 
 
వెంటనే తన భార్యను విడాకులివ్వమని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో నానా రకాలుగా హింసించాడు. చివరికి వెంట వెంటనే మూడుసార్లు తలాక్ అని చెప్పి, ఆమెకు విడాకులిచ్చి, ఇంటి నుంచి గెంటేశాడు.
 
దీంతో పర్వీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు మహమ్మద్ షరీఫుద్దీన్‌ను అరెస్టు చేశారు. భారత శిక్షా స్మృతిలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. తక్షణ ట్రిపుల్ తలాక్ క్రిమినల్ నేరమని సుప్రీంకోర్టు 2017లో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.