పశువుల కాపరిపై సీఆర్పీఎఫ్ లైంగికదాడి... ఎక్కడ?

arrested
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 31 జులై 2020 (15:12 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన పొలంలో పశువులు మేపుతున్న ఓ మహిళపై సీఆర్పీఎఫ్ జవాను ఒకడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సుక్మా జిల్లా, దుబ్బకోట గ్రామంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ దుబ్బకోట సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో పశువులను మేపుతోంది. అంతలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మహిళను బెదిరించి పొలంలోనే ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు.

అతని చెర నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఆ మహిళ... కుటుంబ సభ్యులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుక్మా పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసి నిందితుడైన జవాన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ షాలబ్ సిన్హా చెప్పారు.దీనిపై మరింత చదవండి :