బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (15:38 IST)

భర్తను బంధించి భార్య - కుమార్తెపై గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భర్తను బంధించి, ఆయన భార్య, కుమార్తెను అపహరించిన కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చాయి. 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లా స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలోనే ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఆ రోజున.. ఇంట్లోకి చొరబడిన దుండగులు భర్తను బంధించి అతడి భార్యను 12 ఏళ్ల కూతురిని అపహరించికెళ్లారు. వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
అంతేకాకుండా, బాధితుల ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ కూడా దొంగిలించారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం నేరంతో పాటూ ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.