సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (16:31 IST)

ఏ ఒక్క హీరోతోనూ పడక పంచుకోలేదు : బాలీవుడ్ నటి (Video)

బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో రవీనా టాండన్ ఒకరు. ఈమె హీరోయిన్‌గా నటించిన అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్ట సాధించాయి. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా తెలుగులో కూడా పలు చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. అయితే, తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో క్యాంపు రాజకీయాలు, బంధుప్రీతిపై భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో రవీనా టాండన్‌ తన అనుభవాలను చెప్పుకొచ్చారు. 
 
'నాకు బాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు. నన్ను ప్రోత్సహించిన హీరోలూ లేరు. బాలీవుడ్‌లో ఎవరి క్యాంపుల్లోనూ నేను భాగం కాలేదు. సినిమాల్లో అవకాశాలు, క్యారెక్టర్ల కోసం హీరోలతో పడక పంచుకోలేదు. ఎవరితోనూ ఎఫైర్లు పెట్టుకోలేదు' అని తెల్చి చెప్పారు. హిందీలో 90వ దశకంలో పలు చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగులో నాగార్జున 'ఆకాశవీధిలో', మంచు కుటుంబ హీరోలు నటించిన 'పాండవులు పాండవులు తుమ్మొద' చిత్రాల్లోనూ ఆమె నటించారు. 
 
'హీరోలు చెప్పినట్టు చేయలేదని, ఆడమన్నట్టు ఆడలేదని చాలా సందర్భాల్లో నన్ను అహంభావిగా బావించారు. హీరోలు నవ్వమని చెప్పినప్పుడు నవ్వలేదు. కూర్చోమన్నప్పుడు కూర్చోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. ఆశ్చర్యంగా మహిళా జర్నలిస్టులు నన్ను కిందకు లాగాలని చూశారు. ఇప్పుడు వాళ్లందరూ తమను తాము ఫెమినిస్టులుగా అభివర్ణించుకుంటూ, ఫెమినిస్ట్‌ కాలమ్స్‌ రాస్తుంటే... నాకు ‘నిజంగానా?’ అనిపిస్తుంది అంటూ రవీనా టాండన్ చెప్పుకొచ్చారు.