సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 జనవరి 2020 (13:01 IST)

నా పెదాలను దాటి నాలుకను చప్పరించాడు... షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఈమధ్య కాలంలో సినిమాలు ఎంత ఘాటుగా వుంటున్నాయో, అందులో ముద్దు సీన్లు మరెంత హాటుగా వుంటున్నాయో వేరే చెప్పక్కర్లేదు. హద్దులు దాటిపోతున్న సీన్లపై వివాదాలు చెలరేగిన సంగతి కూడా చూశాం. ఆమధ్య రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ పైన ఓ స్థాయిలో చర్చ జరిగింది. 
 
ఇక అసలు విషయానికి వస్తే... తమిళ చిత్రం ఉట్రాన్ ఈ నెల 31న విడుదలకు సిద్ధమైంది. ఐతే అందులో నటించిన హీరోయిన్‌కి ఎదురైన అనుభవం గురించి కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో హిరోషిణి అనే వర్థమాన తార నటించింది. శృంగారం సన్నివేశంలో భాగంగా ఓ ఘాటు లిప్ లాక్ సీన్ చిత్రీకరించే సమయంలో హీరో రోషన్‌ హద్దులు దాటి చెలరేగిపోయాడట. పెదవులపై ముద్దు పెడుతున్నట్లు పెట్టి నోటిలో ఆమె నాలుకను కూడా చప్పరించేశాడట.
 
దీనితో తీవ్ర ఆగ్రహం చెందిన హీరోయిన్ కిస్ సీన్ పూర్తి కాగానే దర్శకుడిపై మండిపడిందట. లిప్ లాక్ సీన్ వుందని చెబితే ఎప్పుకున్నాను కానీ హీరో తనకు ముద్దు కాకుండా స్మూచ్‌ చేశాడని మండిపడిందట. స్మూచ్ అంటే ఏంటో తెలియక దర్శకుడు నిలువు గుడ్లేసుకుని చూస్తూ వుండగా... లిప్ లాక్ అంటే పెదవులపై పెదవులతో ముద్దు పెట్టడమేనని, స్మూచ్ అంటే పెదవులపై ముద్దు పెట్టి ఆ తర్వాత నోట్లో నాలుకను కూడా చప్పరించడమంటూ అర్థమయ్యేట్లు చెప్పిందట. దాంతో దర్శకుడు షాక్ తిన్నాడట.