శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (09:09 IST)

పరాయి స్త్రీతో పడక సుఖం పొందుతూ నిత్యం ఏడిపిస్తున్నాడు.. తమిళ నటి

ఓ తమిళ నటి మీడియా ముందుకు వచ్చింది. తన భర్త పరాయి స్త్రీతో పడక సుఖం (వివాహేతర సంబంధం) పొందుతూ నిత్యం తనను ఏడిపిస్తున్నాడనీ ఆరోపించింది. ఇదే అంశంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరులో నివసిస్తున్న తమిళనటి రమ్య. ఈమె 2017లో డ్యాన్స్ మాస్టర్ వరదరాజన్‌ను ప్రేమించి పెళ్లాడింది. కొంతకాలం సాఫీగా సాగిన ఈ వివాహ బంధం.. ఆ తర్వాత భర్త కట్టుతప్పడంతో కష్టాల్లోపడింది. 
 
ముఖ్యంగా వరదరాజన్ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని, కట్టుకున్న భార్యను వేధించసాగాడు. ఈ మేరకు నటి రమ్య బెంగళూరు, కోడిగేహళ్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ప్రకారం, అదనపు కట్నం తీసుకురావాలని భర్త వరదరాజన్ వేధిస్తున్నట్టు పేర్కొంది. 
 
పైగా, వివాహ సమయంలో ఇంటి స్థలం, బంగారం, ఆభరణాలు, డబ్బును కట్నంగా ఇచ్చామని చెప్పింది. 'వరదరాజన్‌ డ్యాన్స్‌ అకాడమీ'ని స్థాపించాలని భావిస్తున్న తన భర్త, అందుకు కావాల్సిన డబ్బులు తెచ్చివ్వాలని తన వెంట పడ్డారని రమ్య ఆరోపించింది. తనకు నిత్యమూ హింస ఎదురవుతోందని ఆమె ఆరోపించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.