శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (10:56 IST)

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత నంజుండన్ మృతి

ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును కైవసం చేసుకున్న ప్రముఖ అనువాద సాహిత్యవేత్త డాక్టర్ జి.నంజుండన్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన తన నివాసంలోనే విగతజీవిగా కనిపించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. 
 
నిజానికి ఆయన గుండెపోటుతో నాలుగు రోజుల క్రితమే మరణించివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆయన ఎలా మరణించారన్న విషయాన్ని విచారణ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
 
కాగా, బెంగళూరులోని నాగదేవనహల్లిలో ఉన్న నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో నంజుండన్ మృతదేహం కనిపించింది. బెంగళూరు వర్శిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన, గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోఆయన్ను ఓ అసిస్టెంట్ చూసేందుకు రాగా, విషయం బయటపడింది.