గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (11:57 IST)

దొంగగా మారనున్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్‌లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి 'లాయర్ సాబ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాని క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 
 
ఈ సినిమా చారిత్రాత్మిక నేపథ్యంలో తెరకెక్కుతోంది. మొఘల్ కాలం నాటి నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో దొంగగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 
 
రాబిన్ హుడ్ పాత్ర తీరుగా పవన్ కళ్యాణ్ రోల్ ఉండనుందని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2020 జూన్ నుండి ప్రారంభం కానుంది.