శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (19:51 IST)

భర్త చెడు వ్యసనాలు తట్టుకోలేక మరొక వ్యక్తితో శారీరక సంబంధం, అతను కూడా...?

హర్యానాలోని కురుక్షేత్రజిల్లా బోహ్లి ప్రాంతమది. పింకీకి అదే ప్రాంతానికి చెందిన రవితో పదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త డ్రగ్స్‌కి బానిసయ్యాడు. సంపాదించిన డబ్బంతా దానికే ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేకపోయినా పట్టించుకునేవాడు కాదు.
 
దీంతో అతనితో విబేధించి పిల్లలను తీసుకుని బయటకు వచ్చేసింది అతడి భార్య. థానేసర్ లోని ఆకాష్ నగర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. ఐతే ఆమెపై ఇంటి యజమాని గంగాసింగ్ కన్నేశాడు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుండటతో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కూలి పనిచేసుకుంటూ పిల్లలను చదివిస్తూ ఉండేది. పిల్లలకు అనుమానం రాకుండా ఇంటి యజమానితో సంబంధాన్ని కొనసాగించేది. 
 
అయితే గంగాసింగ్ కూడా మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఉన్న డబ్బులను ఖర్చు చేసి పింకీ దగ్గరకు వచ్చి ఆమె దగ్గరకు డబ్బులు తీసుకెళ్ళేవాడు. ఏమయినా ఎదురుతిరిగి మాట్లాడితే తమ మధ్య వున్న సంబంధం బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేసిన డబ్బును గంగాసింగ్ తీసుకెళ్ళి తాగేయడంతో మొదట్లో తాను ఎదుర్కొన్న పరిస్థితే మళ్ళీ ఆమెకు ఎదురైంది. గంగాసింగ్ పైన కోపం తెచ్చుకుంది.
 
అతనిపై చేయి చేసుకుంది. దీంతో గంగాసింగ్ ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. పూటుగా మద్యం సేవించి నేరుగా ఇంటికి వచ్చి ఆమెను గోడకేసి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత నిందితుడు నేరుగా స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.