శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:43 IST)

కొందరు నెటిజన్లు అత్యాచారం చేసి చంపేస్తాం.. అని బెదిరిస్తున్నారు.. షమీ భార్య

భారత క్రికెటర్ షమీ భార్య, మోడల్‌ హసీన్‌ జహాన్ గతంలో తన భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసారు. దాంతో ప్రస్తుతం ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. తాజాగా రామ జన్మభూమి అయోధ్య ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
 
రామమందిర భూమి పూజ నేపథ్యంలో హసీన్‌ జహాన్ "హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు "అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. కాగా శుభాకాంక్షలు తెలిపినందుకు గానూ తనను కొందరు వేధిస్తున్నారని ఆమె కోల్‌కతా సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు హసీన్. 
 
కొందరు నెటిజన్లు అత్యాచారం చేసి చంపేస్తాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారని హసీన్‌ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని కోరారు. తాను నిస్సహాయురాలినై పోయానని, అభద్రతాభావం వెంటాడుతోందని హసీన్ తెలిపారు. ఇదే తంతు కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయని ఫిర్యాదులో తెలిపారు.