సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (09:53 IST)

మహేష్ బాబు.. ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్‌తో సినిమా చేస్తున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నమైన కథతో రూపొందుతోన్న ఈ మూవీ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాలి కానీ... ఇప్పటి వరకు వెళ్లలేదు. అక్టోబర్ ఎండింగ్ నుంచి లేదా నవంబర్ నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే... మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. రాజమౌళితో మహేష్ బాబు సినిమా ఆలస్యం అవుతుంది.
 
 ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలనుకుంటున్నాడు. ఆ సినిమా ఏ డైరెక్టర్‌తో ఉంటుంది అంటే... స్పైడర్ అనే ఫ్లాప్ మూవీని అందించిన మురుగుదాస్‌తో అని వార్తలు వస్తున్నాయి. 
 
అదేంటి మహేష్ బాబు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి సినిమా ఇవ్వడు కదా.. మరి.. మురుగుదాస్‌కి మరో సినిమా ఇస్తున్నాడా..? ఇది నిజమా..? లేక రూమరా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆరా తీస్తే.. తెలిసింది ఏంటంటే... మురుగుదాస్ మహేష్‌ కోసం కథ రెడీ చేస్తున్నాడట. ఆ కథ మహేష్‌కి నచ్చాలి. సినిమా చేయడానికి ఓకే అనాలి. అందుచేత ఈ ప్రాజెక్ట్ అనుకున్నంత ఈజీ కాదు అని టాక్. మరి.. ఏం జరగనుందో చూడాలి.