మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (19:57 IST)

రజనీ సినిమాలో తెలుగు హీరో, ఇంతకీ.. ఎవరా హీరో..? (video)

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా విశ్వాసం ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి రజనీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే... డైరెక్టర్ శివ క్లాసు, మాసు అనే తేడా లేకుండా అందర్నీ మెప్పించేలా సినిమాను తెరకెక్కించగలడు. దీంతో శివ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను సరికొత్తగా చూపిస్తాడనే నమ్మకంతో ఉన్నారు.
 
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ తెలుగు హీరో నటించనున్నాడు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు గోపీచంద్ అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గోపీచంద్ కాదని తెలిసింది. మరి.. రజనీ సినిమాలో నటించే ఆ తెలుగు హీరో ఎవరంటే... సత్యదేవ్ అని తెలిసింది. సత్యదేవ్ పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని టాక్.
 
ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శివ, తమిళ స్టార్ అజిత్‌తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్‌బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. దీంతో రజనీతో చేస్తున్న ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయం అంటున్నారు. మరి... అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.