శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2020 (12:36 IST)

చిరంజీవి కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్ ఎందుకు ఆగింది..?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న ఆచార్య సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మోషన్ పోస్టర్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆచార్య ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే ఆసక్తి మరింత పెరిగింది. అపజయం ఎరుగని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాని తెరకెక్కిస్తుండడంతో అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
 
మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే... పుట్టినరోజున ఆచార్య అప్డేట్‌తో పాటు కొత్త సినిమా ప్రకటన కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ... కొత్త సినిమా అప్డేట్ రాలేదు. చిరంజీవి మెహర్ రమేష్‌‌తో సినిమా చేయనున్నట్టు ఓ వార్త.. అలాగే డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌తో ఓ సినిమా చేయనున్నట్టు మరో వార్త వినిపించింది.
 
వీటిలో ఏదో ఒక సినిమా గురించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు కానీ... చేయలేదు. దీనికి కారణం ఏంటంటే... చిరంజీవి ఇప్పుడు ఆచార్య అప్డేట్ తప్ప మరో సినిమా గురించి ప్రకటన వద్దు అని చెప్పారట. ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయి కంప్లీట్ అయిన తర్వాతే మరో సినిమా గురించి ఎనౌన్స్ చేద్దామన్నారని తెలిసింది. అయితే... వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ విషయమై కథా చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్.