బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (11:41 IST)

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

Heart attack
జీవనశైలిలో మార్పులు కారణంగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది గుండెపోటు బారినపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల రోగులు రోజురోజుకు అధికమవుతున్నారు. దీనికి కారణం ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులే అని చెప్పుకోవచ్చు. అలాగే జనాలు శారీరక శ్రమ చేస్తూ.. ఎక్కువగా మానసికంగా వర్క్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రోజుల్లో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హార్ట్ పేషెంట్లు సులభమమైన ఆహారప్రణాళికను ఫాలో అవ్వాలని తాజాగా నిపుణులు చెబుతున్నారు. 
 
ఏలాగో ఇప్పుడు చూద్దాం.. 
ప్రతిరోజూ ఉదయం లేవగానే వన్ గ్లాస్ నిమ్మకాయ రసం లేదా ఉసిరికాయ జ్యూస్ తాగాలి. లేకపోతే అత్తి పండ్లు, ఎండు ద్రాక్ష తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీలైతే నైట్ బాదం పప్పులు నానబెట్టి మార్నింగ్ తినండని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం పూట 30 నిమిషాల పాటు వ్యాయామం, యోగా, కూడా చేస్తే హార్ట్ పేషెంట్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
 
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.