శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 అక్టోబరు 2020 (15:45 IST)

వరద బాధితులకు ఈనాడు సంస్థల అధినేతి రామోజీ రావు భారీ విరాళం

తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర సాయం కోరింది. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
 
ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలయ్య కోటిన్నర రూపాయల విరాళం ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా వరుసగా తెలుగు సినీ తారలు తమకు తోచిన సాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఈనాడు గ్రూపు సంస్థల అధినేతి రామోజీరావు వరద బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు.
 
5 కోట్ల రూపాయల విరాళాన్ని హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ నిధికి ప్రకటించారు. మీడియా సంస్థ నుంచి ఇంత పెద్ద భారీ విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.