బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (10:14 IST)

సమంత మెడలో పసుపుతాడు... ఆ ఆఫర్స్ తన్నుకెళుతున్న హీరోయిన్...

సమంతకు పెళ్లయిపోయింది. పసుపు తాడుతో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి దీవెనలు తీసుకుంటోంది. నాగచైతన్య-సమంత జంటగా ఇప్పుడు అదే పనిలో వున్నారు. ఇకపోతే సమంతకు వెళ్లాల్లిన ఛాన్సులన్నిటినీ ఇప్పుడు ఓ భామ తన్నుకెళుతోందట. మరి సమంత చేతిలో ప్రస్తుతం స

సమంతకు పెళ్లయిపోయింది. పసుపు తాడుతో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల వద్దకు వెళ్లి దీవెనలు తీసుకుంటోంది. నాగచైతన్య-సమంత జంటగా ఇప్పుడు అదే పనిలో వున్నారు. ఇకపోతే సమంతకు వెళ్లాల్లిన ఛాన్సులన్నిటినీ ఇప్పుడు ఓ భామ తన్నుకెళుతోందట. మరి సమంత చేతిలో ప్రస్తుతం సినిమాలేమున్నాయ్ అంటే... మహానటి, విజయ్ సరసన నటిస్తున్న అదిరింది చిత్రంతో పాటు రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలోనూ నటిస్తోంది. 
 
ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు మరదలిగా సమంత నటిస్తోంది. ఈ చిత్రాలన్నిటిలోనూ ఆమె గ్లామర్ ఎంతమాత్రం పండించలేదని చెపుతున్నారు. కానీ విజయ్ సరసన నటిస్తున్న అదిరింది చిత్రంలో మాత్రం ఓ మోస్తరు గ్లామర్ షో చూపించిందనే టాక్ వినబడుతోంది. మరి ఇంతలా గ్లామర్ షో చూపిస్తే ఆమెకు అక్కినేని ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి వుంది. 
 
ఇకపోతే సమంత ప్లేసులో అను ఇమ్మాన్యుయేల్ ను బుక్ చేసుకునేందుకు దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారట. ఈమెకు అనుపమ పరమేశ్వరన్ గట్టి పోటీ ఇస్తోంది. వీరిద్దరే సమంత ఛాన్సులను ఎగరేసుకెళతారని అనుకుంటున్నారు.