అనుష్క వరుస సినిమాలు చేయడంలేదు... ఎందుకని?

anushka shetty
జె| Last Modified శుక్రవారం, 18 అక్టోబరు 2019 (21:00 IST)
అనుష్క. ఈ బ్యూటీ తెలుగు సినీపరిశ్రమలో టాప్ హీరోయిన్. జీరో సైజ్‌తో సినిమా చేసి ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయితే చివరకు సాధారణ సైజు వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ బాగా లావై పోయింది. దీంతో అనుష్కకు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గిపోయాయి అనడం కన్నా అవకాశాలు ఇవ్వడం లేదన్న ప్రచారం సినీపరిశ్రమలో బాగానే సాగుతోంది.

అనుష్కకు వయస్సు పెరిగిపోవడం.. శరీరం స్లిమ్‌గా కాకుండా లావు అయిపోవడమే ఆమెకు ప్రధానంగా అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమట. అనుష్కను పెట్టి సినిమా తీద్దామని డైరెక్టర్లు హీరోలను అడిగితే ఆమె వద్దు.. ఆమె లావుగా కనిపిస్తుంది. ఇబ్బందిగా ఉంటుందని ముఖంమీద చెప్పేస్తున్నారట. ఇక డైరెక్టర్లు కూడా అనుష్కను పెట్టి సినిమా తీయడానికి ముందుకు రావడం లేదట.

అయితే వరుసగా అవకాశాలు వచ్చి టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిన అనుష్క ఇప్పుడు తనకు అవకాశాలు రాకపోవడాన్ని చాలా లైట్ తీసుకుంటోందట. తాను సన్నగా అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కాకపోవడంతో తనకు అవకాశం వచ్చినప్పుడు చేద్దాములే అనుకుని ఊరుకుంటోందట. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే అనుష్క ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా ఆమెకు అవకాశాలు తగ్గడానికి మరో కారణంగా ప్రచారమూ జరుగుతోంది.దీనిపై మరింత చదవండి :