సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 18 అక్టోబరు 2019 (20:32 IST)

చిరు - కొర‌టాల‌ మూవీ టైటిల్ ఇదేనా..? చిరు సరసన త్రిష నటిస్తుందా?

కర్టెసీ-సోషల్ మీడియా
మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్‌తో సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఇదిలా ఉంటే.. కొర‌టాల శివ‌తో చిరు త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నారు. ఈ సినిమా ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.
 
ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే టైటిల్ ఖ‌రారు చేసార‌ని ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అభిమానులు గోవింద ఆచార్య టైటిల్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. ఈ పోస్టర్ బాగుండ‌టంతో అఫిషియ‌ల్‌గా రిలీజ్ చేసారేమో అనుకుని తెగ షేర్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. 
 
ఇందులో చిరు స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అయితే.. త్రిష పేరును ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం.