శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (14:33 IST)

చిరు కొరటాల మూవీ- దేవాదాయ శాఖలో ఉద్యోగిగా మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల డైరక్షన్‌లో సినిమా చేసేందుకు మెగాస్టార్ పచ్చజెండా ఊపేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగులో సైరా సక్సెస్ తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో పట్టాలెక్కనున్న ఈ సినిమాను కొరటాల శివ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. 
 
ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా సమాజానికి ఏర్పడే ప్రభావంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. 
 
దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.