ఆనాడు ఎన్టీఆర్-ఏఎన్నార్, ఇప్పుడు మీరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఢిల్లీలో సైరా(Video)
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.
ఈ సినిమా ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేంద్ర పెద్దలకు ఆహ్వానం పంపించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజైన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
ఈ సంచలన చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించగా... కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్ నిర్మించారు. మెగాస్టార్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాటలు... వీడియోలో చూడండి.