శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (16:43 IST)

బిగ్ బాస్ హౌస్‌లోకి గంగులు.. శివజ్యోతి ట్యాప్ ఓపెన్ చేసేసింది.. (Video)

బిగ్ బాస్ మూడో సీజన్‌లో హౌస్ మేట్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. బిగ్ బాస్‌లో 13వ వారం ఎలిమినేషన్స్‌లో పెద్ద వారే జరిగిందనే చెప్పాలి. ఇందులో యాంకర్ శివజ్యోతి తప్పు లేకపోయినా.. ఆమె చేసిన పని వల్ల ఇంటి సభ్యులు అందరూ కూడా నామినేషన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అంటే ఒక్కసారిగా కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి ఈ మ్యాటర్ గురించి చర్చలు జరిపారు.
 
తాను తప్పేమి అనలేదంటూ శివజ్యోతి కన్నీరు పెట్టుకోగా.. తనకు వార్నింగ్ ఇచ్చిందంటూ వరుణ్ ఆమెపై మండిపడ్డాడు. అటు రాహుల్.. శివజ్యోతి, అలీతో కలిసిపోయి వితిక-వరుణ్‌ల మనస్తత్వాల గురించి వివరించగా.. బాబా భాస్కర్ దగ్గర భార్యాభర్తలిద్దరూ శివజ్యోతి అన్న మాటలు చెప్పుకొని వాళ్ళ బాధను వివరించారు.
 
ఇదంతా ఒక ఎత్తయితే.. రాహుల్-శ్రీముఖిల గొడవ మరో ఎత్తు. ఎవరు ఎందులో గొప్పా అనే విషయం చర్చించుకోవాలని బిగ్ బాస్ సూచించగా… ఇద్దరూ కూడా ఒకరంటే.. ఒకరంటూ పాజిటివ్‌లు గురించి మాట్లాడుకోవడం అటుంచి.. తిట్టుకుంటూ గొడవకు దిగారు. రాహుల్ ఒక అడుగు ముందుకేసి శ్రీముఖిని 'గయ్యాల గంపా' అంటూ పెద్ద గొంతెసుకొని పడిపోతావు అని అన్నాడు. దీనితో ఆ గొడవ కాస్తా తారాస్థాయికి చేరింది. 
 
అయితే నామినేషన్ ప్రక్రియ అనంతరం రాహుల్ శ్రీముఖితో మాట్లాడడానికి వస్తే.. నువ్వు లైఫ్‌లో నాతో ఎప్పుడూ మాట్లాడకు.. నేను నీతో మాట్లాడను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా.. నాకు కూడా నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని రాహుల్ సింపుల్‌గా మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇలా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉండగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు హోటల్ టాస్క్ ఇచ్చాడు.
 
ఇక అన్ని సీజన్‌ల మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా కంటెస్టెంట్స్ ఎమోషన్స్‌తో ఆటాడుకున్నారు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్‌ను హోటల్‌గా మార్చేసి ఫన్నీ ఫన్నీ టాస్క్‌లతో ఆటాడించారు. అనంతరం ఇంటి సభ్యులు స్పందించలేని స్థితిలో (ఫ్రీజ్, స్లీప్, మూవ్, ఫార్వర్డ్) ఉండగా.. వాళ్ల రిలేటివ్స్‌ని ఇంట్లోకి పంపించారు.
 
మొదట వితికా చెల్లెలు రితికాని ఇంట్లోకి పంపించారు. ఆ టైంలో వితికా డ్రిల్ చేస్తుండగా.. చెల్లిల్ని చూసి భావోద్వేగానికి గురైంది. అనంతరం చెల్లెల్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. వరుణ్ దగ్గరకు వెళ్లిన రితికా.. హాయ్ బావగారూ ఎలా ఉన్నారు అంటూ స్వీట్ హగ్ ఇచ్చి.. మీరు గేమ్ సూపర్ ఆడుతున్నారు. ఇలాగే ఆడండి.. మా అక్క జాగ్రత్త. బయట మీకు సూపర్ రెస్పాన్స్ ఉంది. టాస్క్‌లలో మీరు ఇంకాస్త బెటర్‌గా చేయండి. బయట విషయాలను పెద్దగా పట్టించుకోకండి’ అంటూ చెప్పుకొచ్చింది.
 
ఇక రితికా అనంతరం అలీ భార్య మసుమ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ టైంలో అలీ స్లీప్‌ మోడ్‌లో ఉండగా.. అతన్ని పట్టుకుని ఏడ్చేసింది మసుమ. ఇక తదుపరి ఎపిసోడ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న శివజ్యోతి భర్త గంగులు వస్తున్నాడు. అతన్ని చూసి ట్యాప్ ఓపెన్ చేస్తోంది శివజ్యోతి. నువ్ ఏడిస్తే నేను వెళిపోతా అంటూ ఆటపట్టిస్తున్నాడు శివజ్యోతి భర్త గంగులు. ఈ ప్రేమ ముచ్చట్లు చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.