సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (17:59 IST)

పవన్ హీరో చరణ్ నిర్మాత: పవర్ స్టార్‌తో చెర్రీ సినిమా చేస్తే.. బాక్సు బద్ధలే..? (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు. అజ్ఞాతవాసి తరువాత పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. కానీ ఎన్నికల తర్వాత తిరిగి సినిమాల్లో రావాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్, బోయపాటి, క్రిష్ అనే ముగ్గురితో సినిమాలు చేసేందుకు పవన్ సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
బండ్ల గణేష్ ప్రొడ్యూసర్‌గా బోయపాటి డైరెక్షన్‌లో పవన్ సినిమా అనే మాట వైరల్‌గా మారింది. అయితే నిర్మాణ సారథ్యం మాత్రం బండ్ల గణేష్‌కు ఇచ్చే ఆలోచనలో కొణిదెల ప్రొడక్షన్స్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీకి పవన్ ఒక సినిమా చెయ్యాలని ఎప్పుడో అడిగి మాటను ప్రస్తుతం రామ్ చరణ్ తెరపైకి తెచ్చారట. 
 
సైరా కూడా కొణిదెల ప్రొడక్షన్స్‌పై విడుదలై హిట్ కొట్టింది. అందుకే పవన్, చరణ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుందని టాక్. మెగా పవర్ స్టార్‌తో చెర్రీ సినిమా చేస్తే.. ఇక రికార్డులు బద్ధలు కావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.