రెగ్యులర్ షూటింగ్‌లో `'7 డేస్ 6 నైట్స్`
MS rajuj on sets
ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగ,అల్ట్రామోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని తీసుకున్నారు. ప్రస్తుత అగ్ర సంగీత దర్శకులలోఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, జూన్ 21న జూలై 10 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబార్ దీవుల్లో నెలరోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేశాం. సెప్టెంబర్ రెండోవారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాం. `డర్టీ హరి' తర్వాత దర్శకుడిగా మరో భారీ విజయానికి నాన్నగారుశ్రీకారం చుట్టారు. సాంకేతిక పరంగానూ ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది" అని అన్నారు.
ఎం.రాజు మాట్లాడుతూ, ఇందులో నటీనటుల వివరాల్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాం. తర్వాత వాళ్లు ఎవరనేది వెల్లడిస్తాం. కథ పరంగా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాలి. అందుకు తగ్గట్టు పక్కా ప్రణాళిక వేసుకుని, చిత్రీకరణ మొదలుపెట్టాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. 'డర్టీహరి'తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. నిర్మాతగా, దర్శకుడిగా నేనెప్పుడూ ఒకదానికి, మరొకదానికి పొంతన లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. 'డర్టీ హరి' ఓ జానర్ సినిమా. '7 డేస్ 6 నైట్స్' కూల్ ఎంటర్టైనర్. ఇందులో వినోదానికి మంచి అవకాశం ఉంది. లవ్, ఎమోషన్స్ కి చక్కటి ఆస్కారం ఉంది. సంగీతానికి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంది. పాటలు కొత్తగా ఉంటాయి" అని అన్నారు.
తర్వాతి కథనం
