శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (20:20 IST)

జనవరి 8న థియేటర్స్‌లో సందడి చేయనున్న 'డర్టీ హరి'

నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా డర్టీ హరి. ఈ చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్)లో డిసెంబర్ 18 విడుదల చేశారు. ఓటిటిలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించిన కారణంగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం అయ్యారు. 
 
ఈ సందర్భంగా ఎంఎస్.రాజు మాట్లాడుతూ... రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్రైడే మూవీస్ ఏటిటిలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. మేము మా డర్టీ హరి సినిమాను జనవరి 8న థియేటర్స్ లో విడుదల చెయ్యబోతున్నాము. థియేటర్ లో మా సినిమాను ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని డర్టీ హరి నిరూపించిందని తెలిపారు.
 
నిర్మాత గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ...  సస్పెన్స్, బోల్డ్ రొమాన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఎమ్మెస్ రాజు. మంచి ట్విస్టులతో పాటు ఆసక్తికరమైన కథనం ఉండటంతో డర్టీ హరి చిత్రం ఓటిటిలో ప్రేక్షకులు బాగా ఆదరించారు. రేపు థియేటర్స్ లో కూడా ఈ సినిమా మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందని భావిస్తున్నాను. శ్రవణ్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలిపారు.
 
శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ... డర్టీ హరి సినిమా థియేటర్ లో ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఓటిటిలో మంచి హిట్ అయిన మా సినిమా రేపు థియేటర్స్ లో కూడా అదే తరహాలో సక్సెస్ సాధిస్తుంది. ఎమ్ఎస్.రాజు గారు సిమిమను తీసిన విధానం అద్భుతంగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. నటుడిగా నాకు మంచి గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
 
నటీనటులు: 
శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖ వాణి తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: ఎమ్మెస్ రాజు
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్
సంగీతం: మార్క్ కే రాబిన్