రీమేక్ అనే భావన కనపడదు : కిశోర్ తిరుమల
ఏ సినిమా చేసినా ప్రేక్షకుడిని ఏవిధంగా మెప్పించామన్నదే దర్శకుడు ఆలోచిస్తాడు. అందుకే ప్రేక్షకులు తెరపై చూస్తున్నప్పుడు ఎక్కడా రీమేక్ అనే భావన కలగదని.. "రెడ్" దర్శకుడు తిరుమల కిషోర్ తలెలియజేస్తున్నాడు. రామ్ హీరోగా ఆయన ఇంతకుముందు 'నేను శైల' చేశాడు. ఇప్పుడు 'రెడ్' చేస్తున్నాడు. సంక్రాంతికి ఈనెల 14న విడుదలకానున్న ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు.
* 'రఘువరన్ బిటెక్' సినిమాకు మాటల రచయితగా అయిన మీరు దర్శకుడుగా మారటానికి కారణం?
నేను దర్శకుడు అవ్వాలనే ఈ రంగంలోకి వచ్చాను. కొరటాల శివ దగ్గర పనిచేశారు. రఘువరన్.. సినిమాకు ఆ దర్శకుడు నాకు స్నేహితుడు. ఆ టైంలో కొంత సమయం కుదిరింది. అందుకే మాటలు రాసే అవకాశం కుదిరింది. ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. మరోవైపు దర్శకుడిగా నా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను.
* రామ్‌తోనే మరలా సినిమా చేయడానికి కారణం?
రామ్‌తో నేను రెండు సినిమాలు చేశా. స్రవంతి రవికిశోర్‌కూడా కథల్లో ఇన్‌వాల్వ్ అవుతారు. అలా మా ముగ్గురి ఆలోచనలు సింక్ అయ్యాయి. అందుకే మా జర్నీ సినిమా పరంగా బాగుంటుందని రామ్‌కు కథ చెప్పా.
* ట్రైలర్‌లో 'ఇస్మార్ట్ శంకర్'ను పోలివున్న సాంగ్, యాక్షన్ కన్పిస్తుంది? అది చూసి రామ్‌ను ఎంపిక చేశారా?
అలాంటిది లేదు. ఈ సినిమా కథ తమిళ మాతృక చూసినప్పుడే ఆయనకైతే బాగుంటుందని అనిపించి రామ్‌కు చెప్పా. ఇక ఇస్మార్ట్ .. తర్వాత రామ్ నుంచి మాస్ ప్రేక్షకులు ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవి ఇందులో వుండేలా చూశాం. ఇది థ్రిల్లర్ డ్రామా కాబట్టి కొత్తగా వుంటుంది.
* 'చిత్రలహరి' తర్వాత మరలా రీమేక్ చేయడానికి కారణం?
కథే ఆసక్తికరంగా వుంది. నాకూ కొత్తగా అనిపించింది. రామ్‌కూడా కొత్తగా వుంటుందని తనను చూడమని చెప్పా. తనకు బాగా నచ్చింది. దాదాపు ఐదు నెలలు కథపై శ్రద్ధ పెట్టాం. కథే మాతృక అయినా దాని చుట్టూ పాత్రలు.. కథనం కూడా కొత్తగా వుండేలా చర్యలు తీసుకున్నాం.
* ఇందులో ముగ్గురు హీరోయిన్లు తీసుకోవాడానికి కరాణం?
కథను బట్టే ఎంపిక జరిగింది. ముగ్గురువి కథకు సరిపడే పాత్రలే. ఇందులో నివేదా పెతురాజ్ పోలీస్ అధికారిగా కనిపిస్తంది. ఆమె ఇంతకుముందు అలాంటి పాత్ర చేసినా ఇది కొత్తగా వుంటుంది. మాళవిక శర్మ మధ్యతరగతి అమ్మాయిగా కన్పిస్తుంది. అమృత అయ్యర్ పాత్ర కీలకం. మీకు వ్యక్తిగపతంగా ఎటువంటి సినిమాలు ఇష్టపడతారు? నాకు ప్రేమకథలు ఇష్టం .కుటుంబ కథా చిత్రాలు ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టం. నా సినిమాల్లో అవి వుండేలా చూస్తాను.
* కొత్త సినిమాలు?
రెండు కథలు సిద్ధంగా వున్నాయి. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా చేస్తున్నా. అందులో శర్వానంద్ హీరో.