మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (12:36 IST)

#REDTrailer వచ్చేసింది.. రామ్ గెటప్స్ అదుర్స్ (ట్రైలర్)

Red
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'రెడ్‌'. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే ఎంతో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన 'తడమ్‌' చిత్రానికి రీమేక్‌గా 'రెడ్‌' తెరకెక్కుతోంది. 'ఇస్మార్ట్‌ శంకర్‌' తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
 
నచ్చిన అమ్మాయి.. కోరుకున్న ఉద్యోగంతో లైఫ్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో హీరో లైఫ్‌లోకి ఓ వ్యక్తి ఎంట్రీతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెబుతూ ట్రైలర్‌ను మొదలవుతుంది. ఇందులో రెండు గెటప్‌లతో రామ్ అదరగొట్టేసినట్లే కనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.