మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (20:35 IST)

విరాటపర్వం సెట్లోకి ఎంటరైన నివేత పేతురాజ్.. మూడో హీరోయిన్ రెడీ

రానా, సాయిపల్లవి జంటగా విరాటపర్వం సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో నటి ప్రియమణి కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు సమర్పణలో ఎస్ ఎల్ వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నివేత పేతురాజ్‌ను ఎంపిక చేశారు. నివేత తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు. 
 
అయితే ప్రస్తుతం నివేత విరాట పర్వం సెట్స్‌లోకి ఎంటర్ అయిపోయారు. ఈ సినిమాలోని లీడ్ రోల్స్ ఇంతకు ముండు నటించన వారే కనిపించనున్నారు. ఈ చిత్రం నెక్సలైట్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఇందులో రానా, సాయి పల్లవి ఉద్యమకారులుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అభిమానులు అంచాలు బాగానే పెట్టుకున్నారు.