మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (12:05 IST)

కొరటాల దర్శకత్వంలో విద్యార్థి నేతగా బన్నీ?

స్టైలష్ స్టార్ అల్లు అర్జున్ మరో చిత్రానికి కమిట్ అయ్యారు. ప్రస్తుతం కె.సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం తర్వాత మరో చిత్రంలో నటించేందుకు బన్నీ పచ్చజెండా ఊపారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. 
 
సక్సెస్‌ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇంకా ఈ సినిమా గురించి మేకర్స్‌ ఎటువంటి సమాచారం బయటపెట్టలేదు.. కానీ ఈ సినిమాలో బన్నీ రోల్‌ ఇలా ఉంటుందని కొందరు రూమర్లు స్టార్ట్ చేశారు.
 
ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న గుసగుసల మేరకు... ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఫస్టాఫ్‌ అంతా ఆంధ్ర విశ్వవిద్యాలయం స్టూడెంట్‌ లీడర్‌గానూ, సెకండాఫ్‌ అంతా రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. 
 
నిజానికి బన్నీ ఇటువంటి పాత్ర ఇప్పటివరకు టచ్‌ చేయలేదు కాబట్టి.. ఇలా పుట్టిస్తున్నారో.. లేదా యూనిట్‌ నుంచి ఏమైనా లీక్‌ అయ్యిందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే సోషల్‌ మీడియాలో మాత్రం బన్నీ రోల్‌పై రూమర్లు వైరల్‌ అవుతున్నాయి. ఇది అల్లు అర్జున్ నటించే 21వ చిత్రం. అందుకే వర్కింగ్ టైటిల్ కూడా ఏఏ21గా పెట్టారు.