ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (11:42 IST)

బాలుడిని చంపేసిన బెలూన్.. ఎక్కడ?

నాలుగేళ్ళ బాలుడుని బెలూన్ చంపేసింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై, అంధేరిలో ఓ నాలుగేళ్ళ దేవరాజు అనే బాలుడు తన సోదరితో కలిసి బెలూన్స్‌తో ఆడుకుంటూ, ఒక దాన్ని గాలితో నింపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఓ బెలూన్‌ను దేవరాజు మింగేశాడు. 
 
ఈ విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు బెలూన్‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో బాధిత బాలుడిని అంధేరిలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు బాలుడిని ప‌రీక్షించి.. నానావ‌తి ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని సూచించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ‌మ‌ధ్య‌లోనే బాలుడు క‌న్నుమూశాడు. పోస్టుమార్టం నిర్వ‌హించిన వైద్యులు.. అత‌ని గొంతులో నుంచి బెలూన్‌ను బ‌య‌ట‌కు తీశారు.