సోమవారం, 18 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By డీవీ
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:49 IST)

ఆ సీన్స్ చేసేట‌ప్పుడు అంద‌రినీ పంపించేశా : సిమ్ర‌త్ కౌర్‌

టీనేజ్‌లో క్ర‌ష్ అనేది స‌హ‌జ‌మే. నాకూ అలాగే అప్ప‌ట్లో అనుభ‌వం వుంది. కానీ 'డ‌ర్టీ హ‌రి' లాంటి సినిమాలాగా మాత్రం కాదు. ఇది కేవ‌లం న‌టి కోసం కొన్ని సీన్ను బోల్డ్‌గా చేశాను. న‌టిగా న‌న్ను నేను నిరూపించుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా అని న‌టి సిమ్ర‌త్ కౌర్ అంటోంది. క‌రాటే బ్లాక్ బెల్ట్ అయిన ఈమె తెలుగులో చేసిన మూడో సినిమా. ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం “డర్టీ హరి”. ఇక ఈ చిత్రం డిసెంబర్ 18న సరికొత్త స్ట్రీమింగ్ యాప్ ఫ్రైడే మూవీస్‌లో విడుదల కానున్న సందర్భంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సిమ్రాత్ కౌర్ ఇచ్చిన‌ ఇంటర్వ్యూ  సారాంశం. ఇదిగో...
 
* ఈ సినిమాలో మీ పాత్ర ఎలా వుంటుంది? 
క్రిస్టియ‌న్ అమ్మాయిని. జాస్మిన్ నా పాత్ర పేరు. చాలా కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్‌గా రోల్ ఉంటుంది. అలాగే పర్సనల్‌గా ఈ రోల్ నాకు చాలా దగ్గరగా అనిపించింది. నేను చేసిన మొదటి సినిమా “ప్రేమతో మీ కార్తీక్”లో పూర్తిగా ఫ్యామిలీ అమ్మాయి రోల్‌లో కనిపించా కానీ ఇందులో దానికి పూర్తి డిఫరెంట్‌గా కనిపిస్తాను.
 
* ఈ పాత్ర మీకు ఎలా ల‌భించింది? 
నేను ముంబైలో ఉన్నప్పుడు ఎం ఎస్ రాజు కాల్ చేసి మాట్లాడారు. అప్పుడే ఒక గూగుల్‌లో పేరు వెతికా. అప్పుడు చూసి ఇంత పెద్ద ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ నాకు కాల్ చెయ్యడం ఏంటి అని, అలా ఆయన హైదరాబాద్ రమ్మన్నారు స్క్రిప్ట్ వినిపించారు. అప్పుడు ఈ స్క్రిప్ట్ అసలు రొటీన్ కాదు చాలా కొత్తగా అనిపించింది. అలాగే ఈ జాస్మిన్ అనే రోల్ కోసం నాకు చెప్పిన విధానం నటిగా చాలా నచ్చింది. అందుకే ఇలాంటి రోల్‌ను నేను ఒప్పుకున్నాను.
 
* మ‌రి ముందు చేయ‌న‌న్నారట గ‌దా? మ‌రి ఎలా చేయ‌గ‌లిగారు? 
కిస్ సీన్సు గురించి చెప్ప‌గా.. చేయ‌న‌ని అన్నాను. న‌టిగా కెరీర్ బాగుండాలంటే.. క‌థ ప‌రంగా వ‌చ్చే స‌న్నివేశాలు, ప్ర‌త్యేకంగా వుండ‌వు.. పాత్ర‌ప‌రంగా చూసుకుంటే.. నీ కెరీర్ బాగుంటుంద‌ని.. రాజు మోటివేట్ చేశారు. పైగా, బాలీవుడ్‌, హాలీవుడ్‌లో ఇటువంటివి కామ‌న్‌. నేటి జ‌న‌రేష‌న్‌కు ఇవేమి కొత్త‌కాదు. క‌థాప‌రంగా వ‌చ్చేవి.. ఇందులో త‌ప్పేమిలేద‌ని చేయ‌డానికి అంగీక‌రించా.
 
* మ‌రి బోల్డ్ సీన్సు చేసేట‌ప్పుడు భ‌య‌ప‌డ‌లేదా? 
కొన్ని బోల్డ్ సీన్సు చేసేట‌ప్పుడు కెమెరా చుట్టు ప‌క్క‌ల చాలా మంది వుండ‌డంతో న‌ర్వెస్‌గా ఫీల‌య్యా. చేయ‌డానికి సంకోచించా.. టేక్‌లు తీసుకున్నా... ఎం.ఎస్‌.రాజుకి విష‌యం చెప్ప‌గానే.. ఆయ‌న అంద‌రినీ పంపించేసి.. న‌లుగురు మాత్ర‌మే వుండేలా చూసుకున్నారు.. అలా ఆ సీన్సు చేయ‌గ‌లిగాను.
 
* మరి ఇలాంటి సినిమా ఒప్పుకున్నపుడు మీ అమ్మగారు ఏమన్నారు? 
ఎం ఎస్ రాజు నాకు కొన్ని కిస్ సీన్స్ కోసం చెప్పినపుడు ఓకే అనుకున్నాను, కానీ నేను మా ఫ్యామిలీని అడగాలని చెప్పను. అలా మా అమ్మని అడుగుదాం అంటే తాను ఖచ్చితంగా ఒప్పకోదు అనే అనుకున్నాను. కానీ ఈరోజుల్లో ఇలాంటి సీన్స్ అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయి, మనం ఒక రూట్ ఎంచుకొన్నపుడు ఇలాంటివి ఉంటాయి కానీ నా నటనకు, పాత్రకు స్కోప్ ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
 
* ఇంతకు ముందు మీరు ఓసారి సినిమాలు చెయ్యను అని స్టేట్‌మెంట్ ఇచ్చారు? 
అవును. పరిచయం సినిమా తర్వాత అసలు సినిమాలు చెయ్యకూడదు అనే అనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పైగా పర్సనల్ లైఫ్‌లో నేను చాలా ఎమోషనల్. వీటితో పాటు నా స్టడీస్ మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లో ఇప్పుడు ఒకలా ఉన్నరోజు రేపు ఎలా ఉంటుందో కూడా చెప్పలేం ఆ టైంలో మళ్ళీ చదువా, సినిమాలా అన్న డైలమాలో ఉన్నపుడు మా ఫామిలీ కూడా చాలా సపోర్ట్ చేసారు. సరిగ్గా ఆ సమయంలో ఈ సినిమా స్క్రిప్ట్‌తో ఎం ఎస్ రాజు ఒక ఏంజెల్(దేవదూత)లా వచ్చారు. సో మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను.
 
* ఎం ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం ఎలా అనిపించింది? 
ఆయన ఇప్పటికే చాలా పెద్ద నిర్మాత. ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతోనే చేశారు. మరి అలాంటి వ్యక్తితో ఓ సినిమా చెయ్యడం అనేదే చాలా గొప్ప విజయం అనుకుంటాను. ఆయన ఏజ్డ్ అయ్యినప్పటికీ చాలా కూల్‌గా ఉంటారు. అలాగే కొన్ని ముద్దు స‌న్నివేశాలు ఆయన వివరించిన విధానం నటనలో అలాగే పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా నేర్పించారు.
 
* మీకు తెలుగురాదు క‌దా.. ఎలా మేనేజ్ చేశారు? 
నాకు తెలుగురాదు. వారు సీన్సు వివ‌రించి చెప్పేవారు. ఆ మూవ్‌మెంట్ చూసి చేసేశా. అయితే.. రెండు పేజీల డైలాగ్ సీన్ చేయ‌డానికి 20 టేక్‌లు తీసుకున్నా... దాంతో చుట్టుప‌క్క‌ల వారికి విసుగు అనిపించింది. ఏడ్చేశా.. నా వ‌ల్ల‌కాదు అని చెప్పేశా.. కానీ రాజు. చాలా ఓపిగ్గా... ఇలాంటివి.. పెద్ద పెద్ద హీరోల‌కే వ‌స్తుంది. మీరు కేవ‌లం పాత్ర‌పై శ్ర‌ద్ధ పెట్టండి అంటూ.. రిలాక్సుగా.. మెలోడి పాట‌లు వినిపించారు. అవి విన్నాక‌.. మంచి ఫీల్‌తో చేయ‌గ‌లిగాను. తెలుగు డైలాగ్‌లు రావ‌డానికి హీరో కూడా చాలా స‌హ‌క‌రించాడు.
 
* ఈ సినిమా ఇప్పుడు విడుద‌ల కావ‌డం స‌రైంద‌ని అనుకుంటున్నారా? 
అనుకోకుండా వచ్చిన కోవిడ్ చాలానే మార్చేసింది. ఒక్క మా సినిమానే కాదు మొత్తం సినీ ప్రపంచాన్నే.. ఈ సినిమాని మేము 2019 డిసెంబరులోనే పూర్తి చేసేశాం. ఫిబ్ర‌వ‌రి 14న ప్లాన్ చేసాం కానీ కొన్ని కారణాల వల్ల అది అవ్వలేదు తర్వాత మార్చిలో ప్లాన్ చేసాం కానీ అప్పుడు లాక్ డౌన్ పెట్టేసరికి అలా ఆగిపోయింది. అప్పుడు అంటే సేఫ్టీ కోసం థియేటర్స్‌కు రాలేదు కానీ ఇప్పుడు ఎనీ టైం థియేటర్స్(ఏటిటి)లో మా సినిమా వస్తున్నందుకు బాగానే అనిపిస్తుంది.
 
* ఎలాంటి పాత్ర‌లు చెయ్యాలి అనుకంటున్నారు? 
ఓ నటిగా అయితే ఎలాంటి రోల్ అయినా చేస్తా అని చెప్తాను కానీ నా డ్రీం రోల్ అయితే ఒక స్పోర్ట్స్ రోల్‌లో చెయ్యాలి అని ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే నేను కూడా వచ్చాను. కరాటేలో నాకు గోల్డ్ మెడల్ కూడా ఉంది. మా అమ్మానాన్నలు కూడా ఒలంపిక్ ప్లేయర్స్ సో అలాంటి రోల్స్‌లో చెయ్యాలి అనుకుంటున్నాను.