సంబంధిత వార్తలు
అక్టోబర్ 8న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
Akil poster
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల అయింది. అఖిల్ లోని 7 వర్షన్స్ చూపిస్తూ విడుదలైన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో 7 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నారు అఖిల్. ఫార్మల్ లుక్ నుంచి.. మోడ్రన్ అవతారం వరకు అన్ని షేడ్స్ లో అలరించారు అఖిల్. తాజాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.
నటీ నటులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు..
