శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (13:58 IST)

శ్రీకృష్ణ జన్మాష్టమి : 'రాధేశ్యామ్' నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని రాధేశ్యామ్ నుంచి మూవీ మేకర్స్ సర్‌ప్రైజింగ్ పోస్టర్ను సోమవారం రిలీజే చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రం రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం ‘రాధే శ్యామ్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. ‘న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. అండ్ ఎ న్యూ రిలీజ్ డేట్’ అంటూ 2022 జనవరి 14న డేట్ ఫిక్స్ చేసేశారు. ఒక‌టి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 
 
1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్‌గా తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా మూవీ నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. విక్ర‌మాదిత్య‌, ప్రేర‌ణ ల‌వ్ లెస్స‌న్స్ నేర్పించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. తాజ‌గా విడుద‌లైన పోస్ట‌ర్‌లోను మూవీ సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ఉంది.