1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ala vaikunthapuramulo interesting news

లిడో డాన్సర్స్‌తో ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

Ala vaikunthapuramulo
అల వైకుంఠపురంలో సామాజవరగమన సాంగ్ షూట్‌కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్‌లో లియో డాన్సర్స్‌తో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అవ్వడం విశేషం. అయితే ఫస్ట్ టైమ్ సౌత్ఇండియన్ స్టార్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన స్టార్‌గా అల్లు అర్జున్ అవ్వటం విశేషం.
 
గత 25 సవత్సరాలకి పైగా ఈ లిడో డాన్స్ ఫేమస్ అని అందరికి తెలిసిన విషయమే. ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్‌ను పారిస్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడమే ఒక హైలెట్ అయితే దీనికి తోడు లిడో డాన్సర్లు యాడ్ అవ్వడంతో సాంగ్ పై అంచనాలు మరించ పెరిగాయి. 
 
ఈ చిత్రం లోని సెకండ్ సింగల్ రాములో రాముల కూడా ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న అల వైకుంఠపురంలో ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
About Writer
శ్రీ
తర్వాతి కథనం
యాంకర్ సుమ సంపాదన గురించి నేను అడగను.. రాజీవ్ కనకాల