ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:09 IST)

ద‌స‌రాకి అల‌.. వైకుంఠ‌పురములో టీజ‌ర్ రిలీజ్ ఉందా..?లేదా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్- మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. ఇందులో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌పోస్టర్‌కు కూడా అమితమైన స్పందన వచ్చింది. ఎలాగో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ముందే ప్రకటించారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మాత్రం ఎప్పుడు విడుదల చేస్తారు అన్న టాక్ వచ్చినప్పుడు మాత్రం ఈ దసరాకే విడుదల కాబోతుందని ఆ మధ్యన జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత ద‌స‌రాకి కాకుండా దీపావ‌ళికి టీజ‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అనే టాక్ వ‌చ్చింది.
 
తాజా వార్త ఏంటంటే... ద‌స‌రాకి టీజ‌ర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. అక్టోబర్ 8 దసరా సందర్భంగా విడుదల చేసేందుకే సిద్ధంగా ఉన్నారని మరింత ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బ‌న్నీ ఫ్యాన్స్ అస‌లు టీజ‌ర్ రిలీజ్ ఉందా..? లేదా..? అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి... అల‌.. వైకుంఠ‌పుర‌ములో టీజ‌ర్ ద‌స‌రాకి వ‌స్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.