ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (16:21 IST)

'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరికంటే...

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ రోజున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా... ఈ సినిమాకి సంబంధించిన విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఫర్స్ ఫిల్మ్స్ వాళ్లు దక్కించుకున్నారు.
 
ఒక్క మిడిల్ ఈస్ట్‌లో మినహా, మిగిలిన అన్ని ప్రాంతాలలోనూ ఫర్స్ ఫిల్మ్స్ వారు యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో కలిసి విదేశాల్లో సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అలా ఫర్స్ ఫిల్మ్స్ వారు ఎన్నో విజయాలను... లాభాలను సాధించి ఉన్నారు. కాగా... 'సాహో' విదేశీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థ చేజిక్కించుకోవడంతో, 'సాహో' మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లనుందనే విషయం స్పష్టం అవుతోంది.