సాహో టీజర్ బాగుంది కానీ... అదే మిస్ అయ్యింది..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో. ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కఫూర్ నటిస్తుంది. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసారు. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో టీజర్‌ను రిలీజ్ చేసారు.
25 మిలియన్స్ డిజిటల్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. టాలీవుడ్ లోని సినీ ప్రములు సాహో టీజర్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే... సాహో టీజర్ బాగుంది అంటున్నారు కానీ.. .ఇందులో అంతా యాక్షన్ సీన్సే చూపించారు కానీ... కథ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే... అసలు ఇందులో కథ ఉండదు. అంతా యాక్షన్ సీన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
హాలీవుడ్ మూవీ చూసామా అనే ఫీలింగ్ కలిగించాలని సుజిత్ ఆలోచన అంటున్నారు. నిజంగానే హాలీవుడ్ మూవీ టీజర్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది.
అయితే.. సినిమాలో ఎన్ని యాక్షన్ సీన్స్ చూపించినా.. ఆఖరికి కథ లేకపోతే ఆడియన్ బాగోలేదు అనే ఛాన్స్ ఉంది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా సాహోలో నిజంగానే కథ లేదా..? లేక ఉంటే బయటపెట్టలేదా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.