సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (18:08 IST)

చైనాలో పండగ చేయనున్న రజనీకాంత్ రోబో సీక్వెల్

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి అయిన రోబో సీక్వెల్ రోబో 2.O, చైనా ప్రజల ఆదరణకు నోచుకోనుంది. ''దంగల్'' వంటి చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన చైనా ప్రజలు ప్రస్తుతం రజనీకాంత్ సినిమాకు మంచి మార్కులేయనున్నారు. రోబో సీక్వెల్ చైనాలో 56వేల థియేటర్లలో జూలై 12వ తేదీన విడుదల కానుంది. 
 
రజనీకాంత్-శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రోబో సీక్వెల్ తెలుగు, మలయాళం, కన్నడ వంటి 15 భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, రజనీకాంత్, ఎమీ జాక్సన్ తదితరులు నటించిన ఈ సినిమా భారత్‌లో రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. అలాగే ఈ సినిమా చైనాలో తొలుత 10వేల థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుతం 56వేల థియేటర్లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.