శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (17:06 IST)

ధోనీ అవుట్.. దుప్పటి కప్పుకుని ఏడ్చిన బాలుడు.. థర్డ్ అంపైర్‌ని తిట్టిపోశాడు.. వీడియో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఇందులో భాగంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. జట్టును ఎలాంటి పరిస్థితిలోనైనా కాపాడే ధోనీ.. ఈసారి జట్టును గెలిపించాల్సిన సమయంలో అవుట్ అయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ అవుట్ కావడాన్ని జీర్ణించుకోలేక పోయిన ఓ బాలుడు ఏడుస్తూ.. థర్డ్ అంపైర్‌కు శాపమిచ్చే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫైనల్‌లో ధోనీ రనౌట్ ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. ఇంకా థర్డ్ అంపైర్ ధోనీని రనౌట్ అంటూ చెప్పడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
ఇలాంటి తరుణంలో ఓ బాలుడు ధోనీ అవుట్ కావడంతో దుప్పటి కప్పుకుని మరీ ఏడ్వడం.. థర్డ్ అంపైర్‌ను తిట్టడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


ఇంకా ధోనీ అవుట్ కాలేదు. ఊరకనే అవుట్ ఇచ్చాడు. ధోనీని అవుట్ అని ప్రకటించిన థర్డ్ అంపైర్‌ ఉరేసుకుని చచ్చిపోతాడు.. అంటూ తిట్టిపోశాడు. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.