సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (16:26 IST)

మహేష్ బాబుది సిటీ.. విజయ్ దేవరకొండది.. విలేజ్..?

ఎఫ్2తో మల్టీస్టారర్‌ను కమర్షియల్ సక్సెస్ చేసిన అనిల్ రావిపూడి త్వరలో మరో మల్టీస్టారర్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక త్వరలో మహేష్ బాబు, విజయ దేవరకొండతో కలసి మరో మల్టీస్టారర్‌కు అనిల్ ప్లాన్ చేశాడు. మహేష్‌బాబు ఇంతకు మునుపే మల్టీస్టారర్‌లో నటించాడు. ప్రస్తుతం అనిల్ సినిమాకు కూడా ఓకే చెప్పాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఇక మహేష్‌తో పాటు మల్టీస్టారర్‌గా నటించిన రెండో పాత్రకు విజయ్‌ని ఒప్పించే పనిలో అనిల్ పడ్డాడని తెలిసింది. ఈ సినిమాలో మహేష్ బాబుది సిటీ బ్యాక్ డ్రాప్‌లో ఉండే పాత్ర కాగా, విజయ్‌ది పూర్తి తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రని తెలిసింది.
 
విజయ్ తెలంగాణ యాసకు తగ్గట్లుగా అనిల్ పాత్రను రూపుదిద్దాడని సమాచారం. ఇక అన్నీ ఓకే అయితే జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రష్మిక మందనాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం.