గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 9 మే 2019 (20:37 IST)

పుట్టినరోజు చిరిగిన డ్రస్‌తో తిరిగిన విజయ్ దేవరకొండ.. ఏమైంది?

సాదాసీదా వ్యక్తులు కూడా తమ పుట్టినరోజు అంటే కొత్త బట్టలు ధరించి రోజంతా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక విఐపిలైతే చెప్పనవసరం లేదు. ఆ డాబు దర్పం కనిపించేలా డ్రస్సులుంటాయి. కానీ యువనటుడు విజయ్ దేవరకొండ మాత్రం తన పుట్టినరోజును చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి నిన్న అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు క్రికెట్ ఆడారు క్రికెట్ దేవరకొండ.
 
ఉదయం 9 గంటలకు నిద్రలేచి కొన్ని ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిద్రముఖంతోనే విజయ్ ఇంటర్య్వూలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు చాలా సింపుల్ డ్రస్‌తో అక్కడక్కడా చిరిగిపోయి కనిపించడం మీడియా ప్రతినిధులనే ఆశ్చర్యానికి గురిచేసింది. నేను ఎంత పెద్ద నటుడినైనా ఒక సాధారణ వ్యక్తినే.
 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే నా ఉద్దేశం. అందుకే ఇలా సింపుల్‌గా ఉంటాను. ఇక సినిమాలంటారా సన్నివేశం బట్టి క్యారెక్టర్ చేయాల్సి ఉంటుంది... అప్పుడు కొత్త బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సినిమా సినిమానే నిజ జీవితం నిజజీవితమే అంటున్నారు విజయ్ దేవరకొండ.