బర్త్‌డే బంప్స్‌తో చంపేసారు.. ఎక్కడ?

sehwag
Last Updated: శుక్రవారం, 3 మే 2019 (09:14 IST)
హైటెక్ ప్రపంచంలో ట్రెండ్ మారుతున్నకొద్దీ యువతీయువకుల ఆలోచనా ధోరణి కూడా పూర్తిగా మారిపోతుంది. తాము చేసే పనుల వల్ల జరిగే విపరీతాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వారు చిత్ర విచిత్ర చేష్టలకు దిగుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకల పార్టీలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తిని పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా చితకబాడంతో చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అది కాస్తా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటపడటంతో దానిని పోస్టు చేస్తూ.. ఇలాంటి పుట్టినరోజు సంబరాలు అవసరమా.. అంటూ ట్వీట్ చేశాడు.

ఇదే అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఇది చాలా బాధాకరం. స్టూడెంట్‍‌ను బర్తడ్ బంప్స్‌తో చనిపోవడానికి కారణమైయ్యారు. ఈ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకోవద్దు. బాధ్యతాయుతంగా ఉండండి. బర్త్ డే బంప్స్ అలాంటివి పెట్టుకోకండి. ఇదెవరికి సరదాగా అనిపించదు" అని వీరూ అభిప్రాయపడ్డాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తుంది. కొందరు సెహ్వాగ్‌కు మద్దతిస్తుంటే.. మరి కొందరేమో నిజంగా చనిపోయాడా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :