గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (14:22 IST)

జయలలిత మృతి కేసు విచారణపై స్టే : సుప్రీంకోర్టు ఆదేశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతి కేసు విచారణపై స్టే విధించింది. విచారణ పేరుతో కమిషన్ తమ వైద్యులను వేధిస్తోందని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసు విచారణపై స్టే విధించింది. 
 
కాగా, అమ్మ మరణంలో ఉన్న మిస్టరీని ఛేదించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్ముగస్వామి సారథ్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కాలపరిమితి గతంలో ముగియగా, దాన్ని ప్రభుత్వం పొడగించింది కూడా. 
 
ఈ కమిషన్ విచారణలో భాగంగా, జయలలితకు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ప్రధాన నర్సులు, పలువురు మంత్రులు, శశికళ బంధువులు, ఇలా అనేక మందిని విచారించారు. ఈ కేసు విచారణలోభాగంగా అపోలో ఆస్పత్రి యాజమానికి మరోమారు కమిషన్ నోటీసులు జారీ చేసింది. 
 
అయితే, ఈ విచారణ పేరుతో తమ ఆస్పత్రి వైద్యులను కమిషన్ వేధిస్తోందంటూ మద్రాసు హైకోర్టులో అపోలో ఆస్పత్రి యాజమాన్యం పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారించిన కోర్టు... కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును అపోలో యాజమాన్యం ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... అర్ముగస్వామి కమిషన్ విచారణపై స్టే విధించింది. దీంతో జయలలిత మృతిలో ఉన్న మిస్టరీ.. ఓ మిస్టరీగానే మారిపోనుంది.