శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 9 మే 2019 (11:41 IST)

'డియ‌ర్ కామ్రేడ్' రిలీజ్ డేట్ మారింది..! మ‌రీ... అంత లేటుగా వ‌స్తున్నాడా..?

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్'. 'ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్' అనేది ట్యాగ్ లైన్. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాలపై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భ‌ర‌త్ క‌మ్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ మూవీని మే 31వ తేదీన రిలీజ్ చేయనున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు. 
 
అయితే... మే 9వ తేదీన విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26వ తేదీన విడుద‌ల చేయనుట్టు ప్రకటించారు. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నట్టు చెప్పారు.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. అలాగే జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీత సార‌థ్యంలో విడుద‌లైన సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.