సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (19:35 IST)

అల వైకుంఠ‌పుర‌ము 'సామజవరగమనా' అల్లాడించేస్తోంది, 7 కోట్ల మంది ఫిదా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అల వైకుంఠపురములో‘. ప్రసిద్ధ నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)లు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన “సామజవరగమన” పాట తెలుగునాట ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో తెలిసిందే.
 
ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. సామాజిక మాధ్యమాలలో కొంగొత్త రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం, ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాములో రాముల‌.. పాట కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.
 
ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్‌ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ ‘అల్లుఅర్జున్, పూజ హెగ్డే’లపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి, శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.