గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 30 అక్టోబరు 2019 (17:36 IST)

బ‌న్నీ 'అల‌.. వైకుంఠ‌పుర‌ము'పై అనిల్ రావిపూడి సెటైర్, ఏంటది?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో, ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానున్నాయి. దీంతో మ‌హేష్‌, అల్లు అర్జున్ మ‌ధ్య బాక్సాఫీస్ వార్ ఆస‌క్తిగా మారింది. దీంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 
 
అయితే... ప్ర‌మోష‌న్స్‌లో బన్నీ సినిమా అల వైకుంఠపురములో జెట్ స్పీడుతో దూసుకెళుతుంది. అల‌.. వైకుంఠ‌పుర‌ములో టీమ్ ఇప్ప‌టికే రెండు సాంగ్స్ రిలీజ్ చేసాయి. ఈ రెండు సాంగ్స్ మిలియన్ వ్యూస్ సాధిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక‌ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు పోస్టర్స్‌తో హంగామా చేస్తున్నాడు. 
 
అయితే... బ‌న్నీ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో దూసుకెళుతుండ‌డంతో మ‌హేష్ టీమ్ దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమా స్టోరీ లీక్ మీద సుబ్బరాజు - వెన్నెల కిషోర్‌లతో షూట్ చేసి ఓ వీడియో రిలీజ్ చేసారు. 
 
ఇందులో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కనిపించి లీకులపై త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు. మన సినిమా సంక్రాంతికి రిలీజ్ క‌దా.. ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు అన్నట్టుగా ఓ డైలాగ్ వదిలాడు. ఈ డైలాగ్ బ‌న్నీ సినిమా అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నాడ‌ని ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ప్ర‌మోష‌న్స్‌లోనే ఇంత‌గా పోటీప‌డుతున్నారు ఇక బాక్సాఫీస్ వార్‌లో ఏ సినిమా విజేత‌గా నిలుస్తుందో అనేది మరింత ఆస‌క్తి పెంచింది. అదీ.. సంగ‌తి.