గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (12:28 IST)

మ‌హేష్‌కి నో చెప్పిన బాలీవుడ్ భామ‌. ఇంత‌కీ ఆ భామ ఎవ‌రు..? (video)

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర పోషిస్తుంటే... మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. 
 
ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో నర్తించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను సంప్రదించారట. అయితే సాంగ్ తనకి పంపిస్తే విని ఆ తరువాత తన నిర్ణయం చెబుతాను అని చెప్పింద‌ట‌. అయితే ప్ర‌స్తుతానికి సాంగ్ రెడీ కాలేదని ఈ పాటను చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తామని అన్నారట. 
 
సాంగ్ వినకుండా తన నిర్ణయాన్ని చెప్పలేనని సోనాక్షి తేల్చి చెప్పేసింద‌ట‌. దీంతో  తమన్నాను కాంటాక్ట్ చేయ‌డం ఆమె వెంట‌నే ఓకే అన‌డం జ‌రిగింద‌ని తెలిసింది. ఈ విధంగా మ‌హేష్ మూవీలో న‌టించేందుకు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నో చెప్ప‌డం హాట్ టాపిక్ అయ్యింది.