కేటీఆర్‌తో తనకున్న సంబంధాన్ని బయటపెట్టిన ప్రభాస్..

Prabhas-Sradha
జె| Last Updated: గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:00 IST)
తనకు ఒక సినిమా నచ్చితే చాలు వెంటనే ఆ సినిమా గురించి పోస్టులు పెడుతుంటాడు తెలంగాణా మంత్రి కె.టి.ఆర్. శ్రీమంతుడు సినిమా రిలీజ్‌కు ముందు మహేష్ బాబు, కొరటాల శివలతో కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేశారాయన. ఇది కాస్త అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీమంతుడు సినిమా మంచి మూవీ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ లు కూడా చేశాడు.

తాజాగా ప్రభాస్ నటించిన సాహో మూవీ కూడా అదుర్స్ అంటూ మెసేజ్ చేశాడు. దీంతో ప్రభాస్ సంతోషపడ్డాడు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన మంత్రి కెటిఆర్ అలా మెసేజ్ చేయడం ప్రభాస్ కు చాలా సంతోషాన్నిచ్చింది. అయితే గత కొన్నివారంరోజులుగా తెలంగాణా రాష్ట్రంలో వైరల్ ఫీవర్ లుగా విపరీతంగా ప్రబలుతున్నాయి.

దీంతో రిటర్న్ గిఫ్ట్ గా ప్రభాస్ ఒక మెసేజ్ చేశాడు. అభిమానులందరు తెలంగాణా ప్రభుత్వానికి సహాయం చేయండి. ఎక్కడైతే విషజ్వరాలు ఉన్నాయో అక్కడకు వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేయండి..కెటిఆర్ కు సహకరించండి అంటూ పోస్ట్ లు చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులందరు సిద్థమయ్యారు. తెలంగాణా రాష్ట్రంలో వైరల్ ఫీవర్ లు పర్యటించే ప్రాంతంలోకి వెళ్ళి అవగాహన కల్పించడానికి సన్నద్థమయ్యారట.దీనిపై మరింత చదవండి :