మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2019 (14:20 IST)

ప్రభాస్ 'సాహో' కలెక్షన్లు : పది రోజుల్లో రూ.400 కోట్ల గ్రాస్...

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. ఈ చిత్రం విడుదలై పదిరోజులు అయింది. ఈ పది రోజుల్లో సాహో చిత్రం ఏకంగా రూ.400 కోట్ల మేరకు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
 
ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించగా, సుజిత్ దర్శకత్వం వహించారు. మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కథాకథనాల పరంగా అంచనాలను అందుకోలేక నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది.
 
ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. ఫలితంగా 10 రోజుల్లో రూ.400 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తొలి రోజునే నెగెటివ్ టాక్ వచ్చినా, నాలుగు భాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. లాంగ్ రన్‌లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చనే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.