మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (10:31 IST)

మిశ్రమస్పందనలోనూ సత్తా చాటిన సాహో... 2 రోజుల్లో రూ.200 కోట్లు

హీరో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం "సాహో". గత శుక్రవారం విడుదలైంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి నెగెటివ్ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది. 
 
"బాహుబలి" చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతోపాటు... సినీ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌తో కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్‌తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'సాహో', రెండో రోజు కూడా అదే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. మొత్తమ్మీద రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. 
 
ఈ మేరకు 'సాహో' నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింద. కాగా, ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెల్సిందే.