గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (11:34 IST)

ప్రపంచ యోగా దినోత్సవం.. 40వేల మందితో ప్రధాని మోదీ యోగాసనాలు (video)

ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్‌ రాంచీ మైదానంలో 40వేల మందితో యోగసనాలు వేశారు. గత పాలనలో మోదీ హయంలోనే ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21వ తేదీ అమలులోకి వచ్చింది.


యోగా ఆరోగ్య ప్రయోజనాలను ప్రపంచానికి చాటిచెప్పడం కోసమే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రముఖులు యోగసనాలు వేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
ఇక యోగా డే గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. యోగా డేను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా వుందని.. సుఖ జీవితానికి యోగా ఎంతో ఉత్తమమైందని చెప్పారు. ప్రపంచ శాంతికి యోగా కీలకంగా మారనుందని.. యోగా ఫలితాలు పేద ప్రజలందరికీ చేరాలని ఆశించారు. ప్రతిరోజూ యోగసనాలు చేయాలని..ప్రజలను ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అతివేగంగా వ్యాపిస్తున్న హృద్రోగాలను దూరం చేసుకోవాలంటే.. యోగాసనాలు వేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్యానికి యోగా ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. 
 
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేసారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ,సినీ,వ్యాపార ప్రముఖలు తమ యోగాసనాలతో యోగా పై చైతన్యం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.